హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బోరబండలోని ప్రభాత్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - CRIME NEWS IN HYDERABAD
ఏడో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
![ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య SEVENTH CLASS STUDENT SUICIDE AT HYDERABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5267602-thumbnail-3x2-ppp.jpg)
SEVENTH CLASS STUDENT SUICIDE AT HYDERABAD
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా... వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విద్యార్థిని మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కూతురిని విగత జీవిగా చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి