హైదరాబాద్ ఎల్బీనగర్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఘనంగా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఏడవ వార్షికోత్సవం - హైదరాబాద్ తాజా వార్తలు
ఎల్బీనగర్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఏడవ వార్షికోత్సవం జరిగింది. వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
![ఘనంగా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఏడవ వార్షికోత్సవం vasavi mahila samakhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14938634-950-14938634-1649177592445.jpg)
అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం జరుగుతుంది కావున ఈ సంవత్సరం శ్రీరామనవమికి చాలా ప్రాధాన్యత ఉందని వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మి తెలిపారు. శ్రీరాముని జీవితాన్ని, ఆయన పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా, భాజపా జాతీయ నాయకులు మురళీధర్ రావు, పేరాల శేఖర్ రావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర సర్కారుకు అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటాం: సైనికాధికారులు