విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఇకపై ఏడువారాల నగలతో అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహామండపం ఏడో అంతస్తులోని వీఐపీ లాంజ్‌లో అమ్మవారి ఏడువారాల నగలను ప్రదర్శినకు ఉంచారు.
ఏడువారాలు... ఏడురకాల నగలతో అమ్మవారు - కనకదుర్గమ్మకు ఏడు వారాల నగలు
ఇకపై ఏడువారాల నగలతో ఇంద్రకీలాద్రి దుర్గమ్మను అలంకరించనున్నారు. వారం విశిష్టతను తెలిపేలా రోజుకో ఆభరణంతో ముస్తాబు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. మహామండపం ఏడో అంతస్తులోని వీఐపీ లాంజ్‌లో అమ్మవారి నగలను ప్రదర్శించారు.

ఏడువారాలు... ఏడురకాల నగలతో అమ్మవారు
సోమవారం ముత్యాలు, మంగళవారం పగడాలు, బుధవారం పచ్చలు, గురువారం పుష్య రాగాలు, శుక్రవారం వజ్రాలు, శనివారం నీలాలు, ఆదివారం కెంపులతో అలంకరించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 12న అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఉత్తరానక్షత్రం సందర్భంగా... ఆ రోజు నుంచి అమ్మవారికి ఏడువారాల నగల అలంకరించనున్నట్లు చెప్పారు.
ఏడువారాలు... ఏడురకాల నగలతో అమ్మవారు