కొవిడ్ మూలంగా ఆర్థికంగా చితికిపోయిన రంగాలను తిరిగి పునర్జీవింప చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడువేల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయి. రైతులు, స్వయం సహాయక గ్రూపులు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు మూడింటికి కలిసి రూ.6939 కోట్లు మొత్తాన్ని బ్యాంకులు రుణాలుగా ఇచ్చినట్లు బ్యాంకర్లు వెల్లడించారు.
ఆత్మనిర్భర్ భారత్ పథకం ఆర్థిక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఈ మూడు వర్గాలను ఆర్థికంగా ఆదుకున్నాయి. ఆయా వర్గాలు తీసుకున్న రుణాల మొత్తంలో కొంత శాతాన్ని రుణాల కింద ఇవ్వాలని కేంద్రం బ్యాంకులను ఆదేశించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 2019-20 ఆర్థిక ఏడాదిలో తీసుకున్న రుణాలల్లో 20శాతం అంటే... దాదాపు తొమ్మిది వేల కోట్లు మొత్తం ఈ ఆత్మ నిర్భర భారత్ పథకం కింద రుణాలు ఇవ్వాల్సి ఉంది.