JUDGES SWEARING CEREMONY: ఏపీలో కొత్తగా నియమితులైన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు.. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కోర్టు హాల్లో ఉదయం పదిన్నర గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తులుగా నియమితులైన కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాతతో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ ఏడుగురు జడ్జిల ప్రమాణ స్వీకారంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరింది.
AP High Court: ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులగా ఏడుగురి ప్రమాణ స్వీకారం - ఏపీ వార్తలు
JUDGES SWEARING CEREMONY: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నియమితులైన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు... ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కోర్టు హాల్లో ఉదయం పదిన్నర గంటలకు... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారితో ప్రమాణం చేయించారు.
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులగా ఏడుగురి ప్రమాణ స్వీకారం
ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో.. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదీ చదవండి:President Ramnath Kovind : హైదరాబాద్‌లో ముగిసిన రాష్ట్రపతి పర్యటన