హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలోని సూరారంలో రెండు కేసులు, చింతల్, పద్మ నగర్, షాపూర్ నగర్, సుభాష్ చంద్రబోస్, గాంధీ నగర్ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదైంది. చింతల్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ రాగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే ఆ వృద్ధుడికి బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.
కుత్బుల్లాపూర్లో ఏడు పాజిటివ్ కేసులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చింతల్కి చెందిన ఓ వృద్ధుడు కరోనా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కరోజే ఏడు కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
కుత్బుల్లాపూర్లో ఏడు పాజిటివ్ కేసులు