రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు - రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం
07:30 March 10
రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కమిటీ ఏర్పాటు
రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి విధివిధానాలు ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గృహనిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన ఆస్తులతో పాటు బండ్లగూడ, పోచారంలో నిర్మించిన ఫ్లాట్లను యథాతథంగా అమ్మేందుకు విధివిధానాలు ఖరారు చేసేందుకు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు.
కమిటీలో సభ్యులుగా ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్‌ను నియమించారు. బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లు, ఇతర ఆస్తుల అమ్మకం కోసం కమిటీ విధివిధానాలు ఖరారు చేయనుంది.