రవాణా శాఖలో శుక్రవారం 2,602 లావాదేవీలు జరగగా రూ. 2.21 కోట్ల ఆదాయం సమకూరిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా రవాణా శాఖ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యాయి.
రవాణా శాఖలో జోరుగా సేవలు - rta
రవాణా శాఖ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం వివిధ లావాదేవీల ద్వారా రూ.2.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.
రవాణా శాఖలో జోరుగా సాగుతున్న సేవలు
లెర్నింగ్, పూర్తిస్థాయి డ్రైవింగ్ లైసెన్సుల జారీ వంటి తదితర సేవలు రవాణా శాఖలో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. రవాణా శాఖలో అన్ని రకాల సేవలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి 7వ తేదీన రూ 1.82 కోట్ల ఆదాయం వచ్చిందని కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలు, సంబంధిత యూనిట్ ఆఫీసుల్లో ప్రభుత్వం సూచించిన నిబంధనలను విధిగా పాటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సరి,బేసి సంఖ్యలతో తెరుచుకున్న దుకాణాలు.. అధికారుల నిఘా