హైదరాబాద్ మూసాపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాని(Registration Office)కి రిజిస్ట్రేషన్ కోసం ఉదయాన్నే ప్రజలు వచ్చారు. సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకున్నారు. కాని సర్వర్ సమస్య రావటంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వేచిచూసి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
Registration Office: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలు - హైదరాబాద్ వార్తలు
రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయా(Registration Office)ల్లో సర్వర్ సమస్య ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు వెనుదిరుగుతున్నారు. హైదరాబాద్ మూసాపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ సమస్య తలెత్తటంతో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారు తిరిగి వెళ్లారు.
![Registration Office: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలు Registration Office: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-tg-hyd-41-05-serverproblemsregistrationoffice-ab-ts10010-05062021153924-0506f-1622887764-141.jpg)
Registration Office: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలు
వెబ్సైట్లలో కొన్ని మార్పులు చేస్తుండడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి సర్వర్లు పనిచేస్తాయని తెలిపారు. ప్రజలు తమకు సహకరించాలి కోరారు.
ఇదీ చదవండి:తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు