తెలంగాణ

telangana

పోలీసుల అదుపులో భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్ ఆజాద్‌

భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్ ఆజాద్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏ వ్యతిరేకంగా అనుమతిలేకుండా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు వెళుతున్న ఆజాద్​ను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని గోషామహల్‌ మైదానానికి తరలించారు.

By

Published : Jan 26, 2020, 10:48 PM IST

Published : Jan 26, 2020, 10:48 PM IST

serious-tension
serious-tension

పోలీసుల అదుపులో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్
హైదరాబాద్​ తుర్కయంజాల్​లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్ భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్ ఆజాద్‌ సందర్శించారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఆయన వచ్చారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.

30 మందికి షోకాజ్ నోటీసులిచ్చారు...

యాజమాన్య ఇబ్బంది పెడుతోందని, 30 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారని విద్యార్థులు వాపోయారు. నగరానికి దూరంగా ఉండడం వల్ల ఇబ్బందవుతోందని చెప్పారు. స్థానికులు వేధిస్తున్నారని విన్నవించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్​ విద్యార్థులను తీసుకుని పోలీస్​స్టేషన్​కు వెళ్లి మాట్లాడారు.

అనుమతి లేనందునే...

హైదరాబాద్​లోని టప్పాచబుత్ర పీఎస్‌ పరిధిలో సీఏఏకు వ్యతిరేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి ఆజాద్ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రశేఖర్ ఆజాద్​తోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, గోషామహల్‌ మైదానికి తరలించారు.

ఇదీ చూడండి : ఇల్లెందులో తెరాస రెబల్​ నేతపై వేటు

ABOUT THE AUTHOR

...view details