తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది రంగారావు - టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది శ్రీ రంగారావును నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎస్ఈఆర్​సీ ఛైర్మన్​గా సీనియర్ న్యాయవాది రంగారావు

By

Published : Oct 24, 2019, 1:34 PM IST

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్‌గా సీనియర్ న్యాయవాది శ్రీ రంగారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్ఈఆర్‌సీ సాంకేతిక సభ్యులుగా ఎండీ మనోహర్‌రాజు, ఆర్థిక సభ్యులుగా బండారు కృష్ణయ్య నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లపాటు వీరు ఈ పదవుల్లోనే కొనసాగుతారని... ఛైర్మన్‌ సహా ఇరువురు 65 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details