తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల అదుపులో సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ - IPS Land Occupation

Senior IPS officer Naveen Kumar Arrest in Hyderabad : ఇల్లు ఖాళీ చేయకుండా కబ్జాకు యత్నించారన్న ఆరోపణలతో సీనియర్ ఐపీఎస్ నవీన్ కుమార్​ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ భన్వర్​లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Senior IPS officer Naveen Kumar
Senior IPS officer Naveen Kumar arrest in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 5:06 PM IST

Updated : Dec 27, 2023, 8:43 PM IST

పోలీసుల అదుపులో సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్

Senior IPS officer Naveen Kumar Arrest in Hyderabad :సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్​ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో ఆయణ్ను పోలీసులు విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న తన ఇంటిని భన్వర్​లాల్ అనే ఐఏఎస్ అధికారి 2014లో ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్​లకు అద్దెకిచ్చారు. అదే సమయంలో ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2019లో అగ్రిమెంట్ పూర్తైన తర్వాత సాంబశివరావు దంపతుల వద్ద ఉన్న అగ్రిమెంట్​ను వారి సమీప బంధువైన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇంట్లోనే నవీన్ నివాసముంటున్నారు.

అయితే నవీన్ తన ఇంటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భన్వర్​లాల్​కు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశాసి ఇంటిని కాజేయాలని చూస్తున్నారని ఫిర్యాదులో భన్వర్​లాల్ సతీమణి మనీలాల్ ఈనెల 17న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్​ల పేర్లను కూడా చేర్చారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 22వ తేదీ ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఇక తాజాగా ఇదే కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్​ను ఏ2గా చేర్చి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

"నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇల్లు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. 2020 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. సివిల్ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసులు వివరాలు కోసం పిలిచారు. నా దగ్గర ఉన్న సమాచారం ఇచ్చాను. లీగల్​గా ముందుకెళ్తా, రేపు అన్ని వివరాలను వెల్లడిస్తాను."- నవీన్ కుమార్, ఐపీఎస్

IPS Naveen Kumar Arrest :మరోవైపుపోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ ఐపీఎస్ అరెస్టును పలు బీసీ సంఘాలు, వారి కుటుంబ సభ్యులు ఖండించారు. నవీన్ కుమార్​ను బషీర్ బాగ్​లోని సీసీఎస్​కు తీసుకురావడంతో వారి కుటుంబ సభ్యులు పలువురు బీసీ సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. తప్పుడు ఫిర్యాదుతో ఓ బీసీ ఐపీఎస్ అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన చేశారు. నిజాయతీ కలిగిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్​ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా పోలీస్ శాఖలో బీసీ అధికారులపై ఈ వేధింపులు జరుగుతున్నాయని త్వరలో ఆయనకు ప్రమోషన్ ఉండటం వల్లనే ఇప్పుడు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరారు.

"ఈరోజు ఉదయం విధులకు వెళ్లే సమయంలో అప్పా జంక్షన్​లో కొంత మంది మా నాన్నను అదుపులోకి తీసుకున్నారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో విషయం తెలిసింది. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు. ఎందుకు అరెస్టు చేశారో తెలియాలి. ఓ ఐపీఎస్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి" అంటూ ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడు సాహిత్ ఆందోళన వ్యక్తం చేశారు.

Dimple Hayathi Controversy : ఐపీఎస్ అధికారి Vs టాలీవుడ్ హీరోయిన్.. తప్పెవరిది..?

IAS Officer Abhishek Singh : సినిమాల కోసం IAS ఉద్యోగానికి రాజీనామా.. ఆ అధికారి కథేంటో తెలుసా?

Last Updated : Dec 27, 2023, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details