తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన సీఎస్​గా జవహర్​రెడ్డి.. సీఎం స్పెషల్​ సీఎస్​గా పూనం మాలకొండయ్య.. - కేఎస్‌ జవహర్‌రెడ్డి

JAWAHAR REDDY AS NEW CS TO AP: ఏపీ నూతన సీఎస్​గా కేఎస్​ జవహర్​రెడ్డి నియమితులయ్యారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు సీనియర్​ ఐఏఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. సీఎం స్పెషల్​ సీఎస్​గా పూనం మాలకొండయ్య నియమించడం జరిగింది.

VJA Jawahar reddy as a CS taza
ఏపీ సీఎస్​ కేఎస్​ జవహర్​రెడ్డి

By

Published : Nov 29, 2022, 6:55 PM IST

JAWAHAR REDDY AS NEW CS TO AP: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా కేఎస్‌ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. జవహర్‌ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 జూన్‌ వరకు.. అంటే మరో ఏడాదిన్నరపాటు సీఎస్‌ పోస్టులో కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జవహర్‌ రెడ్డి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

అధికారిక ప్రకటన

గతంలో ఆయన సీఎం జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేశారు. సీఎస్‌గా పదవీ విరమణ తర్వాత సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దాంతో పాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ వైస్‌ఛైర్మన్‌ పోస్టులోనూ ఇన్‌ఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీ: రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్​ స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూధన రెడ్డి నియమితులయ్యారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా మహ్మద్ దివాన్​ను నియమించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details