Jairam Ramesh on Munugode By Poll: మునుగోడు ఎన్నికల్లో ఓట్లు కాదు.. నోట్ల వరద పారిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. అవి ఓట్ల ఎన్నికలు కాదని నోట్ల ఎన్నికలని అన్నారు. అక్కడ నిన్న ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, మనీయే విజయం సాధించాయని.. అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించారని ఆరోపించారు. కోట్లు సంపాదించిన వారితో ఓ సామాన్య నాయకురాలు ఎన్నికల్లో పోరాడాల్సి వచ్చిందని తెలిపారు.
"తెలంగాణలో వన్‌సీఆర్, టూసీఆర్, త్రీసీఆర్, ఫోర్‌సీఆర్.. కేసీఆర్ అని గద్దర్ చెప్పిన మాట నిజమేనని అనిపిస్తోంది. కేసీఆర్‌అంటే అందరికీ అర్ధమైంది కదా. 15 రోజుల పాటుపూర్తిగా అధికార యంత్రాంగాన్ని మోహరించారు. మద్యం ఏరులై పారి, 200 కోట్ల వరకు ఖర్చు చేశారు. అక్కడ ఓటమితో నిరాశ చెందడం లేదు. కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీనే." అని జైరామ్ రమేశ్ అన్నారు.