హైదరాబాద్ నగరాభివృద్ధిలో సీనియర్ సిటిజన్లు తప్పకుండా బాధ్యత తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సీనియర్ సిటిజన్ల అనుభవం భావితరాలకు ఎంతో అవసరం ఉంటుందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో సీనియర్ సిటిజన్‌లకు ఆసరా కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలో బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు దోమలతో రోగాల బారినపడుతున్నారని తెలిపారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు విష జ్వరాలతో బాధపడుతున్నారని రేవంత్ వివరించారు. ట్విట్టర్ వేదికగా సీనియర్ సిటిజన్‌లు నగరంలోని సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎల్బీనగర్ పరిధిలో ఉన్న 56 సీనియర్ సిటిజన్ క్లబ్‌లను వందకు చేరేలా కృషి చేస్తానని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నగరం కోసం సీనియర్ సిటిజన్‌ల సేవలు అవసరమని స్పష్టం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, కవులు, కళాకారులు, ఆచార వ్యవహారాలను భవిష్యత్ తరాలకు వివరించాల్సిన బాధ్యత సీనియర్ సిటిజన్లపై ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అన్నారు.
'హైదరాబాద్ అభివృద్ధికి సీనియర్ సిటిజన్స్ కృషి చేయాలి'
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో ఉన్న సీనియర్ సిటిజన్‌లకు ఆసరా కార్యక్రమంలో ఆటల పోటీలు నిర్వహించారు. నగరాభివృద్ధిలో సీనియర్లు పాలు పంచుకోవాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు.
నగరాభివృద్ధిలో సీనియర్ సిటిజన్స్ పాలు పంచుకోవాలి :రేవంత్ రెడ్డి
ఇవీ చూడండి : 'నిండుకుండలా నాగార్జున సాగర్'