P.V. Chalapathy Rao Died: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పొక్కల వెంకట చలపతిరావు (88) ఏపీలోని విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిగా, సీనియర్ నేతగా గుర్తింపు పొందిన చలపతిరావు మృతి పట్ల ఆ పార్టీ నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం శాసనమండలి సభ్యులుగా చలపతిరావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు కన్నుమూత - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
P.V. Chalapathy Rao Died: బీజేపీ ఆవిర్భావం నుంచి సేవలందించిన.. సీనియర్ నేత పొక్కల వెంకట చలపతిరావు కన్నుమూశారు. ఆయన.. పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని పార్టీ ప్రముఖులు కొనియాడారు. చలపతిరావు మృతి పట్ల వారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు
చలపతి రావు 1975 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి, ఉద్యమాల్లో పాల్గొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న బండారు దత్తాత్రేయ, కొద్దీ రోజులు క్రితం చలపతిరావును కలిసి అప్పటి పార్టీ జ్ణాపకాలు నెమరు వేసుకున్నారు. చలపతిరావు మృతిపై స్థానిక నేతలు పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చలపతిరావు అంత్య క్రియలు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఇవీ చదవండి: