తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ - హైదరాబాద్​ ఈరోజు క్రైమ్​ వార్తలు

ఇద్దరు యువతి యువకులు ఫేస్​బుక్​ ద్వారా పరిచయం పెంచుకున్నారు. అది కాస్తా ఫొటోలు, వీడియోలు తీసుకునే దాకా వెళ్లింది. ఇద్దరి మధ్య వివాదం కారణంగా విడిపోయారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు చెప్పినట్టు వినకపోతే ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్​ చేస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

send photos to family members Blackmail boy
ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్

By

Published : Jan 11, 2020, 9:30 PM IST

చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను కుటుంబ సభ్యులకు పంపిస్తానని యువతిని బెదిరిస్తున్న యువకుడిని హైదరాబాద్ సీసీఎస్​ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్​బుక్ ద్వారా రాంనగర్​కు చెందిన ఓ యువతికి, ఆంద్రప్రదేశ్ కడప జిల్లా కళాసపల్లికి చెందిన చంద్రశేఖర్​కు పరిచయమైంది. ఇద్దరు చనువుగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు.

ఇద్దరి మధ్య వివాదం కారణంగా విడిపోయారు. ఈ నేపథ్యంలో తాను చెప్పినట్టు వినకపోతే కుటుంబసభ్యులకు ఫొటోలు పంపిస్తానని చంద్రశేఖర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తరుచూ త్రీవ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రశేఖర్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఫొటోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్

ఇదీ చూడండి : వరంగల్​లో ముగిసిన యువతి అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details