మానుకోట తిరుగుబాటు పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భగా బుధవారం చర్చా గోష్ఠి నిర్వహిస్తున్నట్లు... తెజస నేతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మానుకోట తిరుగుబాటు కీలకఘట్టంగా ఉండేదని అన్నారు. ఉదయం 11 గంటలకు జూమ్, ఫేస్‌బుక్ మాధ్యమాల వేదికగా సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.
మానుకోట తిరుగుబాటుపై రేపు తెజస ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి - hyderabad latest news
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకఘట్టం మానుకోట తిరుగుబాటుకు... పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చా గోష్ఠి నిర్వహిస్తున్నట్లు తెజస నేతలు తెలిపారు. తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు.

తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో చర్చా గోష్ఠి
ఈ చర్చాగోష్ఠిలో తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, అద్దంకి దయాకర్ పాల్గొంటారని తెలిపారు. వారితో పాటు నాటి ఉద్యమంలో భాగమైన ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నల్గొండ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు అంచనాలు సిద్ధం చేయాలి: సీఎం