తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సైబ్హర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో పిల్లలు మొబైల్ వాడటం వల్ల జరిగే అనర్థాల గురించి ఐటీ, కమ్యూనికేషన్ రంగ నిపుణులు తెలిపారు.
'మొబైల్ ఫోన్లు పిల్లల మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తాయి' - side effects mobile for kids
ఎనిమిదేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను మొబైల్ ఫోన్‌ల నుంచి దూరంగా ఉంచాలని ఐటీ, కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండేళ్లు కూడా నిండని వారికి కూడా సెల్ఫోన్లు ఇస్తున్నారని... దీని ద్వారా వారి మానసిక, ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
'మొబైల్ ఫోన్లు పిల్లల మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తాయి'
సాంకేతికతకు నేటితరం పిల్లలు వ్యసనపరులవుతున్నారని... ఎనిమిదేళ్ల లోపు వయసున్న పిల్లలకు మొబైల్ ఫోన్లు దూరంగా ఉంచాలని సూచించారు. ఫోన్లు పిల్లల మానసిక, ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. సింబయాసిస్ లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ సైనిక దళాలకు మీడియా శిక్షకురాలుగా ఉన్న జూహీ కౌల్ వచ్చి... ప్రధాన వక్తగా ప్రసంగించారు.