తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం' - తెలంగాణలో కరోనా వైరస్

కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతం కోసం అందరూ చేతులు కలుపుతున్నారు. ప్రభుత్వ చర్యలకు విపక్షాలు, ప్రజా సంఘాలు కలిసివస్తున్నాయి. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమ స్ఫూర్తి తరహాలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు కోరారు. 14 గంటలు కాదు ఏకంగా 24 గంటలపాటు చేపడదామని పిలుపునిచ్చారు. సకలజనులు స్వీయనిర్బంధంలో ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

'Self-incarceration in tomorrow's state'
'Self-incarceration in tomorrow's state'

By

Published : Mar 21, 2020, 8:51 PM IST

Updated : Mar 22, 2020, 12:29 AM IST

ఆదివారం రాష్ట్రం మూగబోనుంది. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన 14 గంటల జనతా కర్ఫ్యూను.. రాష్ట్రంలో 24 గంటల పాటు పాటిద్దామని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు స్వీయ గృహనిర్బంధంలో ఉందామని సీఎం తెలిపారు. రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తిగా కరోనా కట్టడిలో పాలుపంచుకోవాలన్నారు.

చెక్​పోస్టుల వద్ద నిఘా..

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్​చేసేందుకు మొత్తం 54 చెక్​పోస్టులు, 78 జాయింట్ ఇన్​స్పెక్షన్ బృందాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారి మీద ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

ఆర్టీసీ బంద్..

జనతా కర్ఫ్యూలో భాగంగా ఆర్టీసీ బస్సులను నడపబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల బస్సులను 24 గంటల పాటు రాష్ట్రంలోకి రానివ్వమన్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సేవలు అందించడానికి డిపోకు ఐదు బస్సులు సిద్ధంగా ఉంటాయని సీఎం పేర్కొన్నారు.

'రేపు రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'

ఎంఎంటీఎస్, మెట్రో సేవలు కూడా..

కర్ఫ్యూలో భాగంగా మెట్రో సేవలు కూడా నిలిచిపోనున్నాయి. మెట్రోకు అనుబంధంగా ఉన్న ఎల్ అండ్ టీ మాల్స్​ను మూసివేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో 5 మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే.. తమ పరిధిలో నడిచే 250కి పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా 12 ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కర్ఫ్యూ దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడం వల్ల గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు భారీ సంఖ్యలో సికింద్రాబాద్​ స్టేషన్​కు చేరుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్​లో కరోనా లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్​కు తరలిస్తున్నారు.

మద్దతు తెలిపిన పెట్రో డీలర్స్

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో తాము భాగస్వాములమవుతామని రాష్ట్ర పెట్రో డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అత్యవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒకరిద్దరు సిబ్బంది, ఒక డెస్పెన్సివ్ యూనిట్​ను మాత్రమే తెరిచి ఉంచుతారు.

ఏసీలు వాడొద్దు..

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాయాల్లో ఏసీల వాడకాన్ని తగ్గించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీలతో కొవిడ్ ప్రబలే అవకాశం ఉన్నందున ఏసీల వాడకాన్ని తగ్గించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.

సినీ పరిశ్రమ మద్దతు..

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సినీ పరిశ్రమ మద్దతు తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి కర్ఫ్యూలో పాల్గొనాలంటూ.. ఇప్పటికే వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేశ్​, రాజశేఖర్, రాజమౌళి, అనిల్ రావిపూడి.. పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు.

నాయకుల మద్దతు..

జనతా కర్ఫ్యూలో అందరం భాగస్వాములం కావాలని పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వీయ నియంత్రణతోనే ఈ మహమ్మారిని అరికట్టగలమని ఆయన పేర్కొన్నారు.

ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి వైరస్ బారిన పడకుండా ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

కరోనాపై పీసీసీ అధ్యక్షుడు

స్వీయ జాగ్రత్తలతోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. తామంతా జనతా కర్ఫ్యూలో పాల్గొంటారని.. అందరూ అదే పద్ధతి అనుసరించాలని నేతలు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి:జనతా కర్ఫ్యూ: ఆ 12 ఎంఎంటీఎస్​ సర్వీసులు యథాతథం

Last Updated : Mar 22, 2020, 12:29 AM IST

ABOUT THE AUTHOR

...view details