రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో... పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థిత్వాల ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్... వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి శాసనమండలి బరిలో దిగేందుకు... కాంగ్రెస్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ పోటీ నెలకుంది. ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తికలిగిన అభ్యర్థుల నుంచి.. పీసీసీ దరఖాస్తులను ఆదివారం వరకు స్వీకరించగా.... 50 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
ముఖ్య నేతల ప్రయత్నాలు..
2018 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ముఖ్యనేతలు.. పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అనూహ్యంగా ముఖ్యనేతలే బరిలోకి దిగేందుకు ముందుకు వస్తుండడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కరీంనగర్- నిజమాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి.. మాజీ మంత్రి, కాంగ్రెస్ ముఖ్యనేత జీవన్ రెడ్డి గెలుపొంది శాసనమండలిలో అడుగుపెట్టారు. ఇప్పుడు మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై.. పలువురు ముఖ్య నేతలు దృష్టి సారించారు.
30 మంది వరకు...
వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజక వర్గానికి... పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్... ఓయూ ఐకాస నేత మానవతారాయ్, పీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ దామోదర్ రెడ్డి సహా... పలువురు నాయకులు అభ్యర్థిత్వాలను ఆశిస్తూ దరఖాస్తు చేశారు. ఇక హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజక వర్గం నుంచి... పోటీ చేసేందుకు మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్‌కుమార్... మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, రామ్మోహన్‌రెడ్డి, కేఎల్‌ఆర్... మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి సహా 30 మంది వరకు.. దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
చివర క్షణంలో...