తెలంగాణ

telangana

ETV Bharat / state

టోక్యో ఒలింపిక్స్​కు మా క్రీడాకారిణిని ఎంపిక చేయండి: శ్రీనివాస్ గౌడ్

వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న 2020 ఒలింపిక్స్​కు బాక్సర్ నిఖత్ జరీన్​ను ఎంపిక చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి లేఖ రాశారు.

క్రీడాకారిణిని ఎంపిక చేయండి

By

Published : Oct 22, 2019, 4:39 PM IST

బాక్సర్ జరీన్​ను టోక్యో ఒలింపిక్స్​కు ఎంపిక చేయాలి : శ్రీనివాస్ గౌడ్
అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్​లో ప్రతిభ కనబరుస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్​ను 2020 టోక్యో ఒలింపిక్స్​కు ఎంపిక చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి పేరును కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు, స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా డైరెక్టర్ జనరల్​ దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాల్యం నుంచే బాక్సింగ్ క్రీడలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తోందన్నారు.
అంచలంచెలుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఛాంపియన్స్ షిప్​ పోటీల్లో బంగారు పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని మంత్రి ప్రశంసించారు. ప్రతిభ కలిగిన నిఖత్ జరీన్​ను 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్​కు ఎంపిక చేస్తే పతకం సాధించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని
సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని జరీన్ తండ్రి జామీల్ అహ్మద్​కు మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి : పారిస్ ఒలింపిక్స్ లోగోను చూశారా..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details