విజయనగరం జిల్లాలో కొమరాడ తహసీల్దార్ బోర్డు పెట్టుకుని కారులో నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని.. బలిజపేట మండలం పెదపెంకి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 260 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మార్వో బోర్టు పెట్టి నాటు సారా రవాణా.. - spirit illegal transport in mro vehicle
విజయనగరం జిల్లా కొమరాడ తహసీల్దార్ బోర్డు పెట్టుకున్న ప్రయాణిస్తున్న కారులో పోలీసులు నాటుసారాను గుర్తించారు. వాహన డ్రైవర్ దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరిలించారు.
ఎమ్మార్వో బోర్టు పెట్టి నాటు సారా రవాణా.. ఒకరు అరెస్ట్
నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో ఇతరుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!