మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు గంజాయి అక్రమంగా తరలిస్తోన్న ప్రభు భజింగ అనే వ్యక్తిని హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.5 లక్షల విలువైన 30 కేజీల గంజాయి, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత - హైదరాబాద్‌లో గంజాయి పట్టివేత
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తోన్న ఓ వ్యక్తిని హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి భారి స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత
హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ మేరకు పెద్ద అంబర్పేట్ వద్ద గల రింగ్‌రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఒడిశాకు చెందిన ప్రభు భజింగ(24) అనే వ్యక్తిని పట్టుకున్నారు. దర్యాప్తులో మహారాష్ట్రకు చెందిన రాహుల్ అనే వ్యక్తి ఖర్చులకు కోసం 5 వేలు ఇచ్చి గంజాయితో హైదరాబాద్‌కు పంపించాడని తెలిపాడు. కేసు నమోదు చేసి ప్రధాన సూత్రధారి రాహుల్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి