తెలంగాణ

telangana

ETV Bharat / state

పురాతన వెండి నాణేలు స్వాధీనం.. ఎక్కడో తెలుసా! - ummadivaram silver coins

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఉమ్మడివరంలో గ్రామస్థులకు దొరికిన వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఉన్న పురాతన ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఇవి దొరికినట్లు స్థానికులు చెప్పారు.

ఉమ్మడివరంలో పురాతన వెండి నాణేలు స్వాధీనం
ఉమ్మడివరంలో పురాతన వెండి నాణేలు స్వాధీనం

By

Published : Jun 9, 2021, 10:13 AM IST

పురాతన వెండి నాణేలు కొందరికి దొరికాయంటూ ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లాలోని ఆర్‌.ఉమ్మడివరంలో కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో సమావేశమయ్యారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మట్టి తవ్వి శివారులో పారబోశామని, ఇటీవల వర్షం కురవడంతో మట్టిలో నుంచి కొన్ని పురాతన వెండి నాణేలు బయటపడినట్టు గ్రామస్థులు చెప్పారని పోలీసులు తెలిపారు.

వీటిని చూసిన చిన్నారులు విషయాన్ని గ్రామంలో చెప్పడంతో నాణేల కోసం గ్రామస్థులు వెతుకులాట చేపట్టినట్లు గుర్తించామన్నారు. సుమారు 500 వరకు నాణేలు లభించాయని చెప్పారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ అశోక్‌ రెడ్డి, ఎస్సై సుధాకర్‌ ఆ గ్రామాన్ని సందర్శించారు. పురాతన నాణేలు అయినందున అవి ప్రభుత్వానికి చెందుతాయన్నారు. జెట్టేబోయిన అనిల్‌ అనే వ్యక్తి తనకు దొరికిన ఆరు నాణేలను వారికి అందజేశారు. ఇవి 1860 నుంచి 1890 మధ్య కాలానికి చెందినవిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details