తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.8 కోట్లు విలువ చేసే రెడ్​మేడ్ దుస్తులు పట్టివేత - రెడ్​మేడ్ దుస్తులు పట్టివేత

పన్నులు చెల్లించకుండా కోల్​కతా నుంచి భారీ ఎత్తున తీసుకొస్తున్న రెడీమేడ్ దుస్తులు పట్టుబడ్డాయి. ఏపీ పన్నుల శాఖ అధికారులకు ఉన్న సమాచారం మేరకు విజయవాడ రైల్వే స్టేషన్​లో వీటిని గుర్తించారు. సరకు విలువ సుమారు రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

రూ.8 కోట్లు విలువ చేసే రెడ్​మేడ్ దుస్తులు పట్టివేత
రూ.8 కోట్లు విలువ చేసే రెడ్​మేడ్ దుస్తులు పట్టివేత

By

Published : Nov 13, 2020, 6:54 AM IST

పన్నులు చెల్లించకుండా కోల్​కతా నుంచి భారీ ఎత్తున తీసుకొస్తున్న రెడీమేడ్ దుస్తులను ఆంధ్రప్రదేశ్్ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ 8 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీగా దొంగ సరకు వస్తోందనే సమాచారంతో రెండు రోజులుగా విజయవాడ రైల్వే స్టేషన్లో నిఘా ఉంచిన అధికారులు.. సరకు రాగానే పట్టుకున్నారు.

రెడీ మేడ్‌ దుస్తులను సీజ్ చేసి తీసుకెళ్లేందుకు రైల్వే సిబ్బంది అంగీకరించకపోవడం వల్ల పార్శిల్ కార్యాలయం పక్కనున్న ప్లాట్‌ఫాంపై ఉంచారు. నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలించాక.. సరకు యజమానులు వస్తేనే పంపిస్తామని రైల్వే అధికారులు చెప్పడం వల్ల వారి కోసం పన్నుల అధికారులు పహారా కాస్తున్నారు.

ఇదీ చదవండి:పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మృతి

ABOUT THE AUTHOR

...view details