జలమండలి జీఎం రమణ రెడ్డితో హైదరాబాద్ సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ సమావేశం అయ్యారు. వాటర్ బోర్డు పెట్టిన నీటి బకాయిలపై వడ్డీ స్కీం గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి బకాయిలకు సంబంధించి వన్‌టైం సెటిల్మెంట్ స్కీంలో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల వసూలు దిశలో ఈ నిర్ణయం తీసుకున్నామని రమణారెడ్డి వెల్లడించారు. రూ. 2 వేల వరకు వడ్డీ మాఫీ చేసే అధికారం మేనేజర్లకు, రూ. 2001 నుంచి రూ.10 వేల వరకు DGM స్థాయిలో, రూ.10 వేలకు పైగా వడ్డీ మాఫీ అధికారాన్ని జనరల్ మేనేజర్‌కు అప్పగిస్తూ వాటర్ బోర్డ్ ఎండీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
'నీటి బకాయిలపై వడ్డీమాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి' - జలమండలి జీఎంను కలిసిన సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ
దీర్ఘకాలికంగా ఉన్న నీటి బకాయిలపై వడ్డీమాఫీ స్కీంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ సూచించారు. జలమండలి జీఎం రమణరెడ్డితో ఆమె సమావేశమై వాటర్బిల్లుల వన్‌టైం సెటిల్మెంట్ పథకం గురించి ఆరా తీశారు.
'నీటి బకాయిలపై వడ్డీమాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'
ఈ పథకం ఆగస్టు 1 నుంచి 30 రోజుల పాటు అమలులో ఉంటుందని, డివిజన్ ప్రజలు జలమండలి అధికారులకు సహకరించి దీనిని సద్వినియోగపరచుకోవాలని కార్పొరేటర్ హేమ విజ్ఞప్తి చేశారు. అలాగే డివిజన్లో ఉన్న మైలర్గడ్డలో కార్పొరేటర్ పర్యటించి వాటర్‌లైన్ సమస్యలను ఏఈ అన్విత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త పైపులైన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరగతిన పనులు పూర్తి చేయాలని జలమండలి అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా చికిత్