సికింద్రాబాద్లో శ్రీరామ నవమి వేడుకలను కొవిడ్ నిబంధనల నడుమ నిర్వహించారు. సీతాఫల్మండిలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏటా రాములవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా నిరాడంబరంగా జరిపామని అన్నారు.
రామలింగేశ్వర ఆలయంలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం - తెలంగాణ వార్తలు
సీతాఫల్మండిలోని రామలింగేశ్వర ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్ దృష్ట్యా అతి కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.
సీతారాముల కల్యాణం, రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు
సీతారాములను పెళ్లి వస్త్రాల్లో ప్రత్యేకంగా అలంకరించి... శాస్త్రోక్తంగా కల్యాణ తంతు పూర్తి చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ఛైర్మన్ నోముల ప్రకాశ్, ఈవో లావణ్య, ఆలయ పూజారులు రామకృష్ణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కల్యాణ వేడుకను నిర్వహించారు.
ఇదీ చదవండి:బియ్యం గింజలతో సీతారాముల చిత్రపటం