మేషం
అద్భుతంగా ఈ సంవత్సరాన్ని మీరు మొదలుపెడతారు. వృత్తిజీవితంలో మీరు గొప్ప విజయాలు ఆశించవచ్చు. భవిష్యత్ కోసం కూడా మీరు ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ సంవత్సరం పనిలో మీరు స్థిరత్వాన్ని తీసుకువస్తారు. పనిలో ఒత్తిళ్లు, లేదా ప్రభుత్వం లేదా న్యాయపరమైన వ్యవహారాలు పెండింగ్‌లో ఉన్నట్టైతే వాటి పరిష్కారానికి మీరు ప్రాధాన్యత ఇస్తారు. మీ వృత్తి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు సామాజిక మాద్యమాలను ఉపయోగించుకుంటారు.
మీ సంబంధాలు చక్కగా ఉంటాయి. స్నేహితులతో కలవడం తగ్గిపోతుంది, ప్రేమించే వారితో అనుబంధం పెరుగుతుంది. ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో వ్యతిరేక లింగానికి చెందిన వారిని ఆకర్షించడంలో మీ సంభాషణ నైపుణ్యం మీకు ఉపయోగపడుతుంది. సంబంధాలకున్న ప్రాధాన్యతేంటో మీరు ఈ సంవత్సరంలో అర్థం చేసుకుంటారు. సెప్టెంబర్ తర్వాత మీ ఆదాయంలో అనిశ్చితి చోటుచేసుకునే సంకేతాలున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
బకాయిలు ఏమైనా ఉంటే వాటిని ఈ సమయానికి ముందే వసూలు చేసుకోవాలి. మే నెలలో మీరు ప్రభుత్వం లేదా సీనియర్ల నుంచి ప్రయోజనాలను ఆశించవచ్చు. మీ పెద్దల సహకారంతో మీ పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది కానీ ఈ సంవత్సరం చివరి దశలో దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి.
వృషభం
ఈ సంవత్సరం ప్రారంభం చాలా సాధారణంగా ఉంటుంది కానీ కాలం గడుస్తున్న కొద్ది అనుకూలంగా ఉన్నట్లు మీకనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఉత్సాహాన్ని మీరు చూస్తారు. కానీ ఉత్సాహం ఇతరులకు సమస్యగా మారకుండా మీరు చూసుకోవాలి. జీవిత పరమార్థాన్ని మీరు గ్రహిస్తారు. ఈ సంవత్సరమంతా ఉత్సాహంగా, ఆనందంగా సాగిపోతుంది. సంబంధాలను మీరు ఆనందిస్తారు. వ్యక్తిగత జీవితంలోని సానుకూలత మీ వృత్తిజీవితంలో ప్రతిబింబిస్తుంది.
జీవితమంటే ఒడిదొడుకలమయమని, కానీ ప్రతీ క్షణాన్ని ఆనందిస్తూ జీవిస్తేనే విజయం సాధించవచ్చనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో గనక మీరు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. చివరి మూడు నెలలు మీరు ఎటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయకండి. ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకునే ముందు మీ జీవిత భాగస్వామితో మాట్లాడి వారి ఆలోచనలు కూడా తెలుసుకోండి. ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో భాగస్వామితో మీరు బాగా సన్నిహితమవుతారు.
ఈ సమయంలో మీరు దుస్తులు, అభరణాలపై డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. భవిష్యత్ ప్రయోజనాల కోసం బంగారం లేదా వెండిలో కొంత పెట్టుబడి పెట్టండి. మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఆదాయ వనరుల్లో మార్పులు చూస్తారు. మొదటి నాలుగు నెలలు విద్యార్థులు తమ చదువుల విషయంలో తీవ్రంగా ఉండాలి. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అవసరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు మీరు ప్రయత్నిస్తున్నట్టైతే ఈ సంవత్సర చివరి దశలో జాప్యం చోటుచేసుకుంటుంది.
ఈ ఏడాది ప్రథమార్థంలో ఆరోగ్యంపై మీరు అధిక శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది ఆగస్టు వరకు ముక్కు, చెవి, గొంతు సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. ఈ ఏడాది చివరి నెలలో మీ మాటలు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మీ శత్రువులను కనిపెట్టుకొని చూడండి
మిథునంఈ సంవత్సరం మీకు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. మీ ఆర్థిక పరిస్థితి, కెరీర్, సంబంధాలకు సంబంధించిన వాస్తవాలను మీరు తెలుసుకుంటారు. మీ ప్రవర్తనలో స్పష్టత, పారదర్శకత ఉండేలా చూసుకోవాలి. చేతి వరకు వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయనే భావన మీకు కలుగుతుంది. జీవితం అలాగే ఉంటుందని, అలాంటి సందర్భాల్లో అధిక ఉత్సాహం, ఆశ, చక్కని ప్రణాళికతో మరింత శ్రమించాలని మీరు గుర్తుంచుకోవాలి. అలా చేయడం ద్వారా దీర్ఘకాలంలో మీ జీవితంలో మార్పులు చోటుచేసుకొని మీరు శక్తిమంతులుగా రూపొందుతారు.
భాగస్వామ్య వ్యాపారం మీకు అంతగా కలిసిరాదు. ఆర్థికపరమైన లావాదేవీల నిర్వహణలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా అప్పులు తీసుకోవాలనే ఆలోచన మీకు కలిగినా ఈ సంవత్సరం చివరి రెండు నెలలు మీరు అప్పులు తీసుకోకండి. సీనియర్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులతో మీరు వాదనలకు దిగకండి. కుటుంబసభ్యులతో మీరు సన్నిహితమవుతారు. మీ మాటల్లో మర్యాద, మాధుర్యం కనిపించాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కఠిన సంకల్పం వారికి ఆశించిన ఫలితాలు తీసుకువస్తుంది.
సంవత్సరం మధ్యలో సౌకర్యవంతమైన జీవనశైలి కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీరు మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం తలెత్తే స్వల్ప ఆరోగ్య సమస్యలతో శక్తిని కోల్పోయినట్టు మీకనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం.
కర్కాటకం
ఈ సంవత్సరం కష్టాలు, మధుర జ్ఞాపకాల కలబోతగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో మీరు జీవితంలో ముందుకు సాగాలి. ఈ సంవత్సరం మీలో భావోద్వేగాలు తగ్గుతాయి, దీంతో ప్రేమించే వారితో కొంత దూరంగా మసలుతారు. అలాంటి సందర్భాల్లో మీరు మిమ్మల్ని ప్రేమించే వారి దృష్టికోణంలో ఆలోచించాలి. ఉద్యోగులు పని ప్రదేశంలో మార్పు చూస్తారు, అది వారికి దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. మీపై పనిభారం పెరుగుతుంది, ప్రాజెక్టులు పూర్తిచేయడం ఇబ్బందిగా మారుతుంది.
ఫిబ్రవరి నుంచి పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తర్వాత మీలో ఉత్సాహం పెరుగుతుంది, కానీ తోటి ఉద్యోగులతో ఎటువంటి సమస్యలు తెచ్చుకోకండి. భాగస్వామ్య వ్యాపారం లేదా పనుల్లో ఫిబ్రవరి తర్వాత నుంచి జాప్యం చోటుచేసుకుంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా వాటిని పూర్తి చేసుకోండి. సంబంధాలపరంగా ఈ సంవత్సరం మీరు అనుకూలంగా ఉంది. మీ ప్రేమ జీవితానికి ఈ సంవత్సరం మధ్యకాలం సానుకూలంగా ఉంటుంది. కొత్తగా ఏమైనా చేసి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. పరస్పరం సంతోషంగా ఉండేందుకు మీరు, మీ భాగస్వామి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. సెప్టెంబర్ వరకు మీరు ఎవరికి అప్పులు ఇవ్వకండి.
ఈ ఏడాది చివరి దశలో తెలియని వారి నుంచి కొంత లబ్ధి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. స్టాక్‌మార్కెట్ లేదా జూదంలో మీరు ఉన్నట్టైతే సెప్టెంబర్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. డబ్బు పొగొట్టుకునే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్టైతే వారు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో సరైన శ్రద్ధ చూపనందుకు మీరు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ తర్వాతి నుంచి మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు స్వల్ప అనారోగ్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈ సంవత్సరం డయాబెటిస్, ఊబకాయం సమస్యలను మీరు ఎదుర్కొవాల్సి రావచ్చు.
సింహంఈ ఏడాది మీకు చక్కని ఉత్సాహం, శక్తిని తీసుకువస్తుంది. మీ సంబంధాల్లో ఏర్పడిన అనిశ్చితి జనవరి చివరి నాటికి తొలగిపోతుంది. జీవితంలో మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు. సౌకర్యవంతమైన జీవితం కోసం మీరు కొంత ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం మీరు పాత సంబంధాలను తెంపుకొని కొత్త బంధాన్ని మొదలుపెడతారు. ఊహాలను కట్టిబెట్టి వాస్తవికంగా ఆలోచించి దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని మీకు సూచిస్తున్నాం. కొత్త బంధం లేదా కొత్త భాగస్వామి అన్వేషణలో మీరు దూకుడుగా ఉండకూడదని సూచిస్తున్నాం. వివాహ సంబంధ నిర్ణయాలు తీసుకునేందుకు సెప్టెంబర్ తర్వాతి కాలం అనుకూలంగా ఉంది.
ఈ ఏడాది చివరిదశలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన అవసరాల కోసం మీరు కొత్త ఆస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం మీరు కొత్త ఆస్తులు కొనుగోలు చేయదలిస్తే ఈ ఏడాది ప్రథమార్థం మీకు అనుకూలంగా ఉంది. ఏప్రిల్-జూలై మధ్య కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది.
జూలై-ఆగస్టు మధ్య కాలంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులకు మీరు దూరంగా ఉండాలి. మీ పనుల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి విజయం సాధించేందుకు ఈ సంవత్సరం మధ్య కాలం అనుకూలంగా ఉంది. చదువులపరంగా మీ ప్రగతి నిదానంగా సాగుతుంది. కాని ఫిబ్రవరి నుంచి కొంత సాంత్వన దొరుకుతుంది. సెప్టెంబర్ తర్వాత నుంచి పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తుంది. జనవరి చివర నుంచి ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక పనిభారం మీలో బద్ధకాన్ని తీసుకువస్తుంది.
కన్య
ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు, గెలుపు ఆశలు తీసుకువస్తుంది. ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు, కానీ కుటుంబం కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు మీ సంభాషణ స్పష్టంగా ఉండాలి. అంతే కాదు ప్రతీసారి మీరే కరెక్ట్ అనే భావన తొలగించుకోవాలి. ఫిబ్రవరి తర్వాత కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. మీ ప్రేమ జీవితం కోసం మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. కొత్త సంబంధాలు ప్రారంభించదలిస్తే మీరు సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
వివాహితులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మీరు పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కానీ మీరు చేసిన పనికి తగినంత గుర్తింపు రాదు. ఫిబ్రవరి తర్వాత మీ సంతానం నుంచి అందే ఆర్థిక సాయం తగ్గిపోతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది. ఫిబ్రవరి చివరి నుంచి వారు మరింత అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ నుంచి స్నేహితులతో సమయం వృథా చేయడం ఆపాలి. చదువుల కోసం విదేశాలకు వెళ్లదలిస్తే ఈ సంవత్సరం చివరిలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం ఈ సంవత్సరం మీకు అనుకూలిస్తుంది. ఆరోగ్య చక్కగా ఉండేలా చూసుకునేందుకు మీరు సమతుల ఆహారం తీసుకోవాలి, తగిన విశ్రాంతి కూడా అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు వ్యాయామం, ధ్యానం ఆచరించండి.