రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి ఏడాదిలోపే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ... కార్యరూపం దాల్చడంలేదని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై సుమారు 300 కేసులు నమోదయ్యాయని.. వీటిలో 118 కేసులను మాత్రమే న్యాయస్థానానికి బదిలీ చేశారని ఆయన చెప్పారు.
'ఆ కేసులన్నీ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యేలా చూడండి ' - ఎమ్మెల్యేలు, ఎంపీలపై సుమారు 300 కేసులు నమోదయ్యాయి
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసులన్నీ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యేలా చూడాలని గవర్నర్ తమిళిసైని.. సుపరిపాలన వేదిక కోరింది.

Hyderabad latest news
ఈ కేసులలో తగిన తీర్పులు రాకపోతే ప్రజలలో నమ్మకం సల్లగిల్లే ప్రమాదముందని పద్మనాభరెడ్డి తెలిపారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం కొంతమంది ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడం తగదని ఆయన అన్నారు.
TAGGED:
MLAs and MPs cases