తెలంగాణ

telangana

ETV Bharat / state

'రూ.80వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం' - SECUNDRABAD

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలోని జీహెచ్​ఎంసీ కమ్యూనిటీ హాల్​లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఉపసభావతి పద్మారావు గౌడ్​లు హాజరయ్యారు.

'రూ.80వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం'

By

Published : Aug 6, 2019, 4:48 PM IST

దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయని.. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టిన ఏకైక పార్టీ తెరాస మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఐటీ సెక్టార్, పరిశ్రమలు, గృహావసరాలకు, నీటిపారుదల ప్రాజెక్టులకు 24 గంటల విద్యుత్​ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. సికింద్రాబాద్​లోని సీతాఫల్​మండిలో జీహెచ్​ఎంసీ కమ్యూనిటీ హాల్​లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తలసానితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, ఉప సభాపతి పద్మారావు పాల్గొన్నారు. తెలంగాణలో కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఆ ఫలాలను ప్రజలకు అందిస్తుందన్నారు. ఈ నీటితో తెలంగాణ ప్రాంతమంతా సస్యశ్యామలవుతుందన్నారు. రాష్ట్రంలో 80వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉప సభాపతి పద్మారావు పేర్కొన్నారు. వాటిని ప్రజలకు చెంతకు చేర్చాలని కార్యకర్తలకు సూచించారు.

'రూ.80వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం'

ABOUT THE AUTHOR

...view details