సికింద్రాబాద్ నుంచి పశ్చిమ బంగాకు వెళ్లే పలు రైళ్లు రద్దు - tarins cancel details
సికింద్రాబాద్ నుంచి పశ్చిమ బంగాకు వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా... మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పశ్చిమ బంగాలో పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పశ్చిమ బంగాలో లాక్డౌన్ పూర్తిగా అమలుచేస్తున్న కారణంగా పలు ప్రత్యేక రైళ్లు పాక్షికంగా, పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 29 న హౌరా నుంచి యశ్వంత్‌పూర్, 28 న యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్లాల్సిన రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28న సికింద్రాబాద్-హౌరా మధ్య నడవాల్సిన రైలును పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 29న హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన రైలును సైతం పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.