తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై పోరుకు రైల్వే శాఖ సిద్ధం - కరోనాపై పోరుకు రైల్వే శాఖ సిద్ధం

కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ సన్నద్ధమైంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 రైల్వే ప్రధాన ఆస్పత్రులు, 44 ఆరోగ్య విభాగ ఆస్పత్రులు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. వీటితో పాటు ద.మ.రైల్వేలోని క్వారంటైన్ కేంద్రాల్లో 862 పడకలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది.

Secundrabad Railway Prepared Fight To Corona
కరోనాపై పోరుకు రైల్వే శాఖ సిద్ధం

By

Published : Apr 11, 2020, 11:42 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రైల్వే శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వైరస్​ కట్టడిని మరింత బలోపేతం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఐసోలేషన్ వార్డులను కూడా సిద్ధంగా ఉంచినట్లు రైల్వే శాఖ చెబుతోంది. సెంట్రల్ ఆస్పత్రి, లాలగూడలో 142 పడకలు, విజయవాడలోని రైల్వే ఆస్పత్రిలో 100 పడకలు, గుంతకల్ లోని రైల్వే ఆస్పత్రిలో 42 పడకలను ఏర్పాటు చేశారు.

రోగులకు సేవ చేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించటానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ 15 చివరి తేదీగా పేర్కొన్నారు. వీరందరికి వీడియో కాలింగ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ www.scr.indianrailways.gov అందుబాటులో ఉన్నాయని ద.మ.రైల్వే అధికారులు తెలిపారు.

ఇవీచూడండి:ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details