తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు. సికింద్రాబాద్లో తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. పోరాటాలు.. ఉద్యమాల బాటలో నడిచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ.. పార్టీ జెండాను ఆవిష్కరించారు.
'తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన నాయకుడు' - trs formation day in secundrabad
సికింద్రాబాద్లో తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే పద్మారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
'తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన నాయకుడు'