సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సివిల్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమురయ్య, అసోసియేషన్ సభ్యులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు - Telangana Formation Day Celebrations
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సికింద్రాబాద్లో బార్ అసోసియేషన్ సభ్యులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యమ సమయంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు.
నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో అడ్వకేట్లు చూపిన ఉద్యమ స్ఫూర్తి ఎంతో గొప్పదని ఆయన గుర్తు చేశారు. అనంతరం అమర వీరులకు నివాళులర్పించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.