Secunderabad to Tirupati Vande Bharath Timings Change : సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించి కీలక విషయాన్ని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎనిమిది కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలు బోగీల సామర్థ్యాన్ని ఇటీవలే రెట్టింపు చేసిన రైల్వే బోర్డు తాజాగా మరో మార్పు తీసుకువచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పు తీసుకువచ్చినట్లు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇంతకీ వందే భారత్ రైలు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..?
Secunderabad to Tirupati Vande Bharath Train : సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో స్వల్పమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ సమయాన్ని ఈ నెల 17 నుంచి ఉదయం 6:15 గంటలకు మారుస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చే రైలు మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
Secunderabad to Tirupati Vande Bharath Train Timings : రెండు వైపులా 8 గంటల 15 నిమిషాల్లో గమ్య స్థానాలను చేరుకునేలా వేళల్ని ఖరారు చేశారు. అయితే మార్పుచేసిన వేళల్ని ఐఆర్సీసీటీసీ తన అధికారిక వెబ్ సైట్‌లో అప్ డేట్ చేయలేదు. డిమాండ్ దృష్ట్యా బోగీల సంఖ్యను 16కు పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. పెంచిన బోగీలను కూడా ఈనెల 17 నుంచి అమలు చేసేందుకు యోచిస్తోంది. ఈ మేరకు సీట్ల సంఖ్య 530 నుంచి 1,036కు పెరగనుంది.