Secunderabad Railway Station Redevelopment 2023 పరుగులు పెడుతోన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు అప్పటికల్లా పూర్తి Secunderabad Railway Station Redevelopment 2023 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో త్వరలోనే రాష్ట్రంలో ఉత్తమ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా దశలవారీగా పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే వారి ఇబ్బదులు తొలగించడమే లక్ష్యంగా స్టేషన్ పునరాభివృద్ది పనులు చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది.
South Central Railway Economy Meals : రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ స్టేషన్లలో రూ.50కే భోజనం
Modernisation of Secunderabad Railway Station :పనులు 3 దశల్లో నిర్మాణం చేపట్టగా 36 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. కొత్త స్టేషన్ భవనంలో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేoదుకు వీలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్‌ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ట్రావెలేటర్‌లతో పాటు రెండు నడకమార్గాల నిర్మాణాన్ని ఉత్తర, దక్షిణ వైపు ఉన్న భవనాల వద్ద చేపడుతున్నారు.
రైల్వేస్టేషన్‌కు.. ఉత్తరం, దక్షిణ వైపున 3 అంతస్థులతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. రెండు అంతస్థుల్లో వేచి ఉండే గదుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రయాణికులు, వాహనాల కదలికలను నివారించేందుకు.. ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేషన్‌కు ఉత్తరం వైపు మల్టీ-లెవల్ పార్కింగ్, దక్షిణం వైపులో భూగర్భ పార్కింగ్ నిర్మిస్తుండటంతో రాకపోకలకు సమస్య ఉండదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Amrit Bharat Station Scheme in TS : రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. దేశవ్యాప్తంగా 508.. రాష్ట్రంలో ఎన్నో తెలుసా?
South Central Railway :కొత్త స్టేషన్ బిల్డింగ్‌లో అన్ని ప్లాట్‌ఫామ్‌లపై.. ఎలక్ట్రానిక్ సూచిక బోర్డులు సహా అధునాతన సౌకర్యాలుండేలా చర్యలు చేపట్టారు. స్టేషన్‌కు అవసరమైన కరెంట్ కోసం 5 వేల కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా విద్యుత్ ఆదా అవుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. స్టేషన్ అవసరాల కోసం 16 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యమున్న.. నాలుగు జీఎల్ఆర్ సంపుల నిర్మాణం చేపడుతున్నారు.
రిజర్వేషన్ కాంప్లెక్స్ వద్ద 1.5 లక్షల లీటర్ల నిల్వ ఉండేలా.. మంచి నీటి సంపు, ఫ్లాట్‌ఫాం నంబర్ 10 వద్ద 3 లక్షలు నిల్వ చేసే సంపు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అవసరమైన నీటి కోసం 3 లక్షల నీటిని అందుబాటులో ఉంచేలా నిర్మిస్తున్నారు. మరోటి.. 1 ఫ్లాట్ ఫారం వద్ద 3 లక్షల నీటి నిల్వ ఉండేలా అమ్‌శ్రీ కాంప్లెక్స్ వద్ద 5.05 లక్షల నీటిని నిల్వ ఉండే సంపు నిర్మాణం చేశారు.
అక్కడి నీటిని కోచ్‌లలో నింపేందుకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా.. మౌలిక సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో పునరాభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఇవిగో ఫొటోస్..!!