తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : 'సికింద్రాబాట్ ఘటన.. సామగ్రి కోసం వెళ్లి చిక్కుకున్న ముగ్గురు - సికింద్రాబాద్ అగ్నిప్రమాదం లైవ్ అప్డేట్స్

secunderabad fire accident
secunderabad fire accident

By

Published : Jan 20, 2023, 8:31 AM IST

Updated : Jan 20, 2023, 2:12 PM IST

13:44 January 20

సికింద్రాబాద్‌: అగ్నిప్రమాద ఘటనలో భవన యజమాని పరారీ

  • అగ్నిప్రమాదం జరిగిన భవన యజమాని జావేద్‌ పరారీ
  • మంటలు రాగానే 17 మంది భవనం నుంచి బయటకొచ్చారు: స్థానికులు
  • సామగ్రి తెచ్చేందుకు వెళ్లి ముగ్గురు లోపల చిక్కుకుపోయారన్న ప్రత్యేక్ష సాక్షులు
  • చిక్కకుపోయిన ముగ్గురు గుజరాత్‌కి చెందిన కార్మికులుగా గుర్తింపు
  • జునైద్(25), జహీర్‌(22), వసీం(32) చిక్కుకున్నారన్న ప్రత్యేక్ష సాక్షులు

13:05 January 20

అగ్ని ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణం కాదు: విద్యుత్‌శాఖ అధికారి

  • మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉంది: శ్రీధర్‌
  • షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయ్యేది: విద్యుత్‌శాఖ అధికారి
  • కానీ సబ్‌ స్టేషన్‌లో అలా జరగలేదు: విద్యుత్‌శాఖ అధికారి శ్రీధర్‌
  • నిన్న ఫోన్ రాగానే భవనానికి విద్యుత్ సరఫరా నిలిపేశాం: శ్రీధర్‌
  • ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవి: శ్రీధర్‌

12:52 January 20

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం షార్ట్​సర్క్యూట్​ వల్ల జరగలేదు: విద్యుత్ శాఖ అధికారి

  • ఆరో అంతస్తు నుంచి మంటలు రావడంతోనే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చు: విద్యుత్ శాఖ అధికారి
  • షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణం కాదంటున్న అధికారులు
  • అగ్నిప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ నిలిపివేసినట్లు తెలిపిన అధికారులు

12:36 January 20

అగ్నిప్రమాదం భవనం పరిసరాల్లో వైద్య శిబిరం ఏర్పాటు

  • సికింద్రాబాద్‌: వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్యారోగ్య శాఖ
  • పొగ కారణంగా అస్వస్థతకు గురైన వారికి మందులు పంపిణీ
  • సికింద్రాబాద్‌: వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుల బృందం

11:27 January 20

స్కై లిఫ్ట్‌ సాయంతో భవనం పై అంతస్తును బయటి నుంచి పరిశీలిస్తున్న అధికారులు

  • భవనాన్ని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రాంతీయ అధికారి పాపయ్య పరిశీలన
  • ఇంకా మంటలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిశీలన

11:20 January 20

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద భవనాన్ని పరిశీలిస్తున్న ఇంజినీరింగ్ విభాగం నిపుణులు

  • భవనాన్ని పరిశీలిస్తున్న వరంగల్ ఎన్ఐటీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణులు
  • ఎన్ఐటీ ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ నిపుణుల పరిశీలన

10:49 January 20

సికింద్రాబాద్ అగ్నిప్రమాదస్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • అగ్నిప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్న కిషన్‌రెడ్డి
  • అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదు: కిషన్‌రెడ్డి
  • మంటలు అదుపు చేసేందుకు ఇంకా సమయం పడుతుంది: కిషన్‌రెడ్డి
  • అగ్నిప్రమాద ఘటనలపై సర్వేలు చేయాల్సి ఉంది: కిషన్‌రెడ్డి
  • అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది: కిషన్‌రెడ్డి

10:29 January 20

అగ్నిప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్న కిషన్‌రెడ్డి

  • అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదు: కిషన్‌రెడ్డి
  • మంటలు అదుపు చేసేందుకు ఇంకా సమయం పడుతుంది: కిషన్‌రెడ్డి
  • అగ్నిప్రమాద ఘటనలపై సర్వేలు చేయాల్సి ఉంది: కిషన్‌రెడ్డి
  • అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది: కిషన్‌రెడ్డి

09:56 January 20

సికింద్రాబాద్ ఘటనాస్థలికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • సికింద్రాబాద్ అగ్నిప్రమాద స్థలిని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • అగ్నిప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్న కిషన్‌రెడ్డి

08:50 January 20

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు

  • సికింద్రాబాద్‌: భవనంలో దాదాపు 12 గంటల పాటు అగ్నికీలలు
  • మంటల ధాటికి పూర్తిగా దెబ్బతిన్న భవనం.. లోపలికి వెళ్లలేని పరిస్థితి
  • అగ్నిప్రమాదంలో అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
  • ఏడీఎఫ్‌వో ధనుంజయరెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావుకు అస్వస్థత
  • సికింద్రాబాద్‌: ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడీఎఫ్‌వో, డ్రైవర్
  • సికింద్రాబాద్‌: చికిత్స పొందుతున్న డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమం
  • సికింద్రాబాద్‌: వెంటిలేటర్‌పై నర్సింగరావుకు చికిత్స అందిస్తున్న వైద్యులు

08:29 January 20

అగ్నిప్రమాద భవనంలో దాదాపు 12 గంటల పాటు అగ్నికీలలు

  • అగ్నిప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న భవనం లోపలికి వెళ్లలేని పరిస్థితి
  • ఆచూకీ లేని ముగ్గురు బిహారీల కోసం క్రేన్ సాయంతో గాలించనున్న పోలీసులు
  • గాలింపు తర్వాత భవనం కూల్చివేతపై నిర్ణయం
  • మృతదేహాల ఆనవాళ్లు కనిపిస్తే బయటకు తీస్తామంటున్న పోలీసులు

08:28 January 20

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు

  • అగ్నిప్రమాదంలో అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది
  • ఏడీఎఫ్‌వో ధనుంజయరెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావుకు అస్వస్థత
  • ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడీఎఫ్‌వో, డ్రైవర్
  • చికిత్స పొందుతున్న డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమం
  • వెంటిలేటర్‌పై నర్సింగరావుకు చికిత్స అందిస్తున్న వైద్యులు

08:27 January 20

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఆచూకీ గల్లంతుపై అనుమానాలు

  • సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో ముగ్గురు ఆచూకీ గల్లంతుపై అనుమానాలు
  • ఆచూకీ లేని ముగ్గురు బిహార్‌ కూలీల కుటుంబసభ్యుల్లో ఆందోళన
  • పోలీసులను సంప్రదించిన జునైద్, వసీం, అక్తర్ కుటుంబసభ్యులు
  • కాలిపోయిన భవనంలోనే కూలీల సెల్‌ సిగ్నల్‌ చూపిస్తున్నట్లు పోలీసుల గుర్తింపు
  • భవనం లోపలే ఉంటే మృతదేహాలు కాలి బూడిదై ఉండొచ్చని పోలీసుల అనుమానం
Last Updated : Jan 20, 2023, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details