తెలంగాణ

telangana

ETV Bharat / state

'సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల ఆస్తినష్టం' - హైదరాబాద్ తాజా వార్తలు

Heavy Property Damage to Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ జరిగిన అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్‌ గుప్తా తెలిపారు. రైళ్ల రద్దుతో జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామాగ్రి భారీగా ధ్వంసమైందని ఆయన పేర్కొన్నారు.

రైళ్లు ధ్వంసం
రైళ్లు ధ్వంసం

By

Published : Jun 18, 2022, 3:44 PM IST

Updated : Jun 18, 2022, 4:14 PM IST

Heavy Property Damage to Railways: సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్‌ గుప్తా వెల్లడించారు. రైళ్ల రద్దుతో జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామాగ్రి భారీగా ధ్వంసమయిందన్నారు. పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్‌లో జరిగిన ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు.

ఆందోళనకారుల దాడిలో 5రైలు ఇంజన్లు, 30 బోగీలు ధ్వంసమయ్యాయని.. పార్శిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. డీజిల్‌ ట్యాంకర్‌కు భారీ ప్రమాదం తప్పిందని.. దానికి కనుక మంటలు అంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగేదని అన్నారు. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్‌ను పునరుద్దరణ చేశామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని డివిజనల్ మేనేజర్‌ గుప్తా వెల్లడించారు.

సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల ఆస్తినష్టం

"నిన్న సికింద్రాబాద్ స్టేషన్​లో జరిగిన ఘటనలో చాలా మంది నిరసనకారులు పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండానే వారు స్టేషన్​లోకి వచ్చారు. వారు రావడంతోనే రైల్వే ఆస్తులు, రైల్వే కోచ్​లను ధ్వంసం చేశారు. సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగింది. రైళ్ల రద్దు వల్ల నష్టాన్ని అంచనా వేస్తున్నాం. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి భారీగా ధ్వంసమైంది. రైలు ఇంజిన్లు 5, బోగీలు 30 ధ్వంసమయ్యాయి. పవర్ కార్(డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పింది." -గుప్తా డివిజనల్ మేనేజర్‌

ఇదీ చదవండి:Agnipath Protest: సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్ ఘటనలో ఎప్పుడేం జరిగిందంటే?

'అగ్నిపథ్​' నిరసనలతో ఆగిన ట్రైన్​​​.. వ్యక్తి మృతి.. రైలులోనే మహిళ ప్రసవం

Last Updated : Jun 18, 2022, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details