తెలంగాణ

telangana

ETV Bharat / state

'కంటోన్మెంట్​ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తా' - jakkula maheshwar reddy

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ అభివృద్ధి కోసమే తాను ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్నట్లు కంటోన్మెంట్​ బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్​ రెడ్డి స్పష్టం చేశారు. రేపు జరిగే ఉపాధ్యక్ష పదవి పోటీలో బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిపారు. కేవలం కుర్చీ కోసమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.

secunderabad cantonment
'కంటోన్మెంట్​ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తా'

By

Published : Dec 27, 2020, 7:56 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్​ అభివృద్ధి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఉపాధ్యక్ష పదవి చేపట్టనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు జరిగే కంటోన్మెంట్ ఉపాధ్యక్ష పదవి పోటీలో బోర్డు సభ్యులు తనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అనేకమంది ఉపాధ్యక్షులుగా కొనసాగినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు.

కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తా

3 నెలల క్రితం కంటోన్మెంట్​ బోర్డులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలను తీసుకువచ్చినట్లు మహేశ్వర్​ రెడ్డి తెలిపారు. గత రెండు నెలలుగా రూ. 34 కోట్ల నిధులతో కంటోన్మెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కేవలం కుర్చీ కోసమే కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి.. కేంద్రం నుంచి నిధులను తెప్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కంటోన్మెంట్​లో నీటి సరఫరా చేయొద్దని తెరాస నాయకులు ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితి లేదని.. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో ఏ విధంగా నీటి సరఫరా జరుగుతుందో కంటోన్మెంట్​లోనూ అదే విధంగా కొనసాగుతుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో స్టెప్పులేసిన జేసీ

ABOUT THE AUTHOR

...view details