తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాగ్దానాలు మాటలకే కానీ.. చేతల్లో లేవు' - Cantonment Board elections

సికింద్రాబాద్ కంటోన్మెంట్​ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ స్థానిక మంత్రులు చేస్తున్న వాగ్దానాలు మాటలకే పరిమితమవుతున్నాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్​ ప్రెసిడెంట్ భానుక నర్మద మల్లికార్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ సీఈవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Secunderabad Cantonment Board former wise president met CEO ajith reddy
కంటోన్మెెంట్ సీఈఓను కలిసిన మాజీ వైస్ ప్రెసిడెంట్

By

Published : Jul 16, 2020, 6:24 PM IST

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ప్రాంత అభివృద్ధిపై స్థానిక మంత్రుల హామీలు మాటల్లోనే గాక, చేతల్లోనూ ఉండాలని కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ భానుక నర్మద మల్లికార్జున్ అన్నారు. బోర్డు సీఈవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, దీర్ఘకాలిక సమస్యలను చర్చించారు.

కంటోన్మెంట్ ప్రాంతంలో పెంచిన.. ఇంటి పన్నులను తగ్గించాలని సీఈవో అజిత్ రెడ్డిని మాజీ వైస్ ప్రెసిడెంట్ కోరారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని సీఈవో హామీ ఇచ్చారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్థానిక మంత్రులు బోర్డు మీటింగ్​లకు హాజరై హామీలివ్వడం హాస్యాస్పదంగా ఉందని భానుక మల్లికార్జున్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో బోర్డు సభ్యులు చతికిల పడ్డారని విమర్శించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను మంత్రులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున కంటోన్మెంట్ ప్రాంతానికి నిధులు కేటాయిస్తామన్న హామీని అమలు చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.

కరోనా వ్యాప్తి నివారణకు కంటోన్మెంట్​లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మహమ్మారి విజృంభిస్తోందని భానుక మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పదవిలో లేకున్నా... నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details