కష్టకాలంలో పేదలకు అండగా నిలిచి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసున్న మహారాజని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చాణక్య నగర్, బేగంపేట డివిజన్ లోని భగవంతాపూర్, బన్సీలాల్ పేట డివిజన్ లోని సోమప్ప మఠం, మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని బండి మెట్లలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేశారు.
వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేసిన తలసాని సాయి కిరణ్
హైదరాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఒక్కో బాధిత కుటుంబానికి మంజూరైన 10వేల రూపాయలను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ అందించారు.
వరద బాధితులకు సాయమందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 550 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసిందని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఈ సాయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రభుత్వ సాయం అందని బాధిత కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందని..వారికి కూడా ఆర్థిక సాయం అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10 వేల రూపాయల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్లు, సనత్ నగర్ డివిజన్ తెరాస అధ్యక్షులు ,తదితరులు పాల్గొన్నారు.
- ఇవీ చదవండి:మూసీ మురుగు వదిలింది.. ఊపిరాడుతోంది...