తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్సీ' ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్: సీపీ మహేశ్​ భగవత్​ - MLC elections counting update

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున హైదరాబాద్​ సరూర్​నగర్ ఇండోర్​ స్టేడియం పరిధిలో 144 సెక్షన్​ అమలులో ఉంటుందని సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు. 5 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇండోర్​ స్టేడియంలోని లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

Section 144 on 'MLC' counting day in indore stadium limits
'ఎమ్మెల్సీ' ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్: సీపీ మహేశ్​ భగవత్​

By

Published : Mar 15, 2021, 7:09 PM IST

సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ లెక్కింపు కేంద్రాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. లెక్కింపు కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

బందోబస్తు కోసం సుమారు 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. మౌంటెడ్ గుర్రాలు, పెట్రోలింగ్ వాహనాలు, సీసీటీవీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు రోజున ఇండోర్ స్టేడియం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 5 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రభుత్వం హామీ ఇచ్చింది.. విచారణ అవసరం లేదు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details