హైకోర్టుకు శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య నివేదిక సమర్పించారు. కొవిడ్ వల్ల 177 మంది చిన్నారులు అనాథలయ్యారని నివేదికలో పేర్కొన్నారు. న్యాయసేవాధికార సంస్థ సహాయం తీసుకుంటున్నామని దివ్య తెలిపారు.
High court: మహిళలపై గృహహింస ఆందోళన కలిగిస్తోంది - High Court hearing on corona conditions
తెలంగాణ హైకోర్టుకు కరోనా పరిస్థితులపై శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య నివేదిక సమర్పించారు. కరోనా వేళ మహిళలపై గృహహింస ఆందోళన కలిగిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది.
![High court: మహిళలపై గృహహింస ఆందోళన కలిగిస్తోంది High court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12234748-432-12234748-1624440187119.jpg)
10 మందికి ఒకరిద్దరు అధికారులను నియమించాలని హైకోర్టు సూచించింది. పిల్లలతో సన్నిహితంగా ఉంటూ వారి అవసరాలు తీర్చాలని పేర్కొంది. కరోనా వేళ మహిళలపై గృహహింస ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బాధిత మహిళలను ఆదుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 17 మంది టీచర్లు కరోనా మృతి చెందారని.. చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలని ఆదేశించింది. డెల్టా వేరియంట్ ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని వెల్లడించింది. కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జులై 8కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు: విద్యాశాఖ