ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటూ.. త్రికరణశుద్ధితో పని చేస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, వయోపరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
'ఉద్యోగులమంతా త్రికరణశుద్ధితో పని చేస్తాం' - ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, వయోపరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై.. సచివాలయం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్స్ పంచుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
'ఉద్యోగులమంతా త్రికరణశుద్ధితో పని చేస్తాం'
సచివాలయం ఉద్యోగులంతా.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. డప్పు దరువులతో నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.
ఇదీ చదవండి:ప్రాథమిక పాఠశాలలకు 5,793 హెచ్‌ఎం కొలువులు