తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ నుంచి ఏపీకి సచివాలయ ఉద్యోగులు - హైదరాబాద్ నుంచి అమరావతికి సచివాలయ ఉద్యోగులు న్యూస్

లాక్​డౌన్ వలన హైదరాబాద్​లో చిక్కుకుపోయిన... ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి బయలుదేరారు. ప్రత్యేక ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉద్యోగులంతా తరలివెళ్లారు.

ap secretariateemployees retur to amaravathi
హైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన సచివాలయ ఉద్యోగులు

By

Published : May 27, 2020, 9:53 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోయిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అమరావతి బయల్దేరారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతితో ప్రత్యేక బస్సుల్లో వారిని తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌లో చిక్కుకున్న సచివాలయ ఉద్యోగులను రాష్ట్రానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర సీఎస్‌ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు లేఖ రాశారు.

400 మందికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని సీఎస్‌ లేఖలో కోరారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్‌ నుంచి 10 ఆర్టీసీ బస్సుల్లో సచివాలయ ఉద్యోగులు అమరావతి తరలి వస్తున్నారు.

హైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన సచివాలయ ఉద్యోగులుహైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన సచివాలయ ఉద్యోగులు

ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'

ABOUT THE AUTHOR

...view details