ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా వెంటనే తమ పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలిసేందుకు ఉద్యోగులు ప్రయత్నించారు. అనుమతి లేదని చెప్పడంతో సీఎస్ కార్యాలయం వద్దే ఉద్యోగులు బైఠాయించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
SECRETARIAT: పదోన్నతులు పూర్తిచేయాలని సచివాలయ ఉద్యోగుల నిరసన
హామీలకు అనుగుణంగా ప్రభుత్వం తమ పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
SECRETARIAT: పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని సచివాలయ ఉద్యోగుల ఆందోళన
తాము ఇప్పటికే రెండేళ్లు నష్టోయాయని.. ఈ నెల దాటితే మరో ఏడాది నష్టపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లో ఉన్న దాదాపు 140 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎస్ వేరే సమావేశంలో ఉన్నందున రేపు కలవాలని ఉద్యోగులకు సిబ్బంది సూచించడంతో ఆందోళన ఆపేశారు.
ఇదీ చదవండి:DALITHABANDHU: ''దళితబంధు'తో దళితుల్లో ఆ నమ్మకం కనబడుతోంది'