తెలంగాణ

telangana

ETV Bharat / state

సీరం సర్వే-2 వివరాలు ప్రకటించిన ఎన్‌ఐఎన్‌

తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తిపై భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) కలిసి ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సీరం సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వివరాలను ఎన్‌ఐఎన్‌ విడుదల చేసింది.

Survey on Corona Latest Results
సీరం సర్వే-2 వివరాలు ప్రకటించిన ఎన్‌ఐఎన్‌

By

Published : Oct 1, 2020, 9:17 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై జాతీయ పోషకాహార సంస్థ... ఎన్ఐఎన్ నిర్వహించిన రెండో దఫా... సీరం సర్వేకి సంబంధించిన ఫలితాలను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలోని నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో తొలివిడత సర్వే చేసిన విషయం తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆగష్టు 26, 27 తేదీల్లో ఆయా జిల్లాల్లో ఎన్​ఐఎన్​ రెండో దఫా సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసి ...10 ఏళ్లుపై బడిన మొత్తం 1309 మంది రక్త నమూనాలు సేకరించింది. ఆయా శాంపిళ్లను పరిశీలించిన ఎన్​ఐఎన్​... మొత్తం శాంపిల్స్‌లో 160 మందికి వైరస్ సోకినట్టు గుర్తించింది.

ఇక ఆయా జిల్లాల వారిగా గమనిస్తే... జనగామలో 454 మండిపై సర్వే చేయగా 83 మందికి అంటే 18.2 శాతం, కామారెడ్డిలో 433 మందికి గాను 30 మందికి అంటే 6.9 శాతం, నల్గొండలో 422 మందికి గాను... 47 మందిలో వైరస్ నిర్ధరణ అయింది. అంటే 11.1 శాతం మంది వైరస్ భారిన పడినట్టు గుర్తించింది. అయితే మేలో కంటే ఆగష్టు నాటికి ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నట్టు ప్రకటించింది.

ఇదీ చదవండి: ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం

ABOUT THE AUTHOR

...view details