తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంఎంటీఎస్​ రెండో దశ పరుగు నేటి నుంచి ప్రారంభం - ఎంఎంటీఎస్​ రైళ్లు రెండో ధశ

ఎంఎంటీఎస్​ రెండో దశ పరుగు నేటి రాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఫలక్​నుమా నుంచి లింగంపల్లి వరకు నడిచే ఎంఎంటీఎస్​ రైలు ఇవాళ్టి నుంచి రామచంద్రాపురం వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తోన్న రైళ్ల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.

ఎంఎంటీఎస్​ రైళ్లు

By

Published : Jun 9, 2019, 5:27 PM IST

నేటి నుంచి ప్రారంభం కానున్న ఎంఎంటీఎస్​ రెండో దశ పరుగు

నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రెండో దశ పరుగు ఈరోజు రాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఫలక్​నుమా నుంచి లింగంపల్లి వరకు మాత్రమే నడిచే ఎంఎంటీఎస్ నేటి నుంచి రామచంద్రాపురం వరకు వెళ్లనుంది. రాత్రి 9:05 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్​కు రాత్రి 10.59 గంటలకు, రామచంద్రాపురానికి 11.10 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

ప్రస్తుత రైళ్ల సమయాల్లో మార్పు లేదు

దీనిని పొడిగించడం వల్ల ప్రస్తుతం నడుస్తున్న ఎంఎంటీఎస్​ రైళ్ల రాకపోకల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ పేర్కొన్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్, కేంద్ర సహాయ మంత్రి​

ABOUT THE AUTHOR

...view details