Second Phase Double Bedroom Houses Distribution in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల (Double Bedroom Houses in Hyderabad) రెండోవిడత పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.10,000 కోట్లతో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. తొలివిడతలో 11,700 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తాజాగా రెండో విడతలో 13,300 ఇళ్లను అర్హులైన వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పజెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో నిర్మించిన 2,100 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఎదురుచూపులు 'డబుల్'.. నిర్మాణాలు పూర్తయినా అందని ద్రాక్షగానే..!
KTR Distributed Double Bedroom Houses Dundigal :లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన మంత్రి కేటీఆర్ (KTR).. అత్యంత పారదర్శకంగా అర్హులకు గృహాలు అందజేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతల ప్రకటనలకు మించి.. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు త్వరలోనే వాటిని ప్రజల ముందుంచుతామని అన్నారు. ప్రగతిరథ చక్రాలు అడ్డుకునేందుకు యత్నిస్తున్న వారి మాటలు ప్రజలు నమ్మొద్దని కేటీఆర్ కోరారు.
"రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్క రోజే 13,300 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించాయా?. భవిష్యత్‌లో అర్హులందరికీ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తాం." -కేటీఆర్, మంత్రి
Harishrao Distributed Double Bedroom Houses Kollur :కాంగ్రెస్ నేతలు ఎన్ని దొంగ డిక్లరేషన్‌లు ప్రకటించినా.. ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయటం ఖాయమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Harishrao) తెలిపారు. ప్రపంచమంతా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లడుకుంటుంటే.. ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు మాత్రం కనిపించటంలేదన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని (2BHK Distribution in GHMC).. 9 నియోజకవర్గాల లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్‌రావు అందజేశారు.